- Advertisement -
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. 24 గంటల్లో 1.13 లక్షలు కరోనా టెస్టులు చేయగా 3,052 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఏడుగురు చనిపోయారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో కరోనా కేసుల సంఖ్య 3.32 లక్షలకు చేరుకోగా 1772 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 3.06 లక్షల మంది కోలుకోగా 24 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు. పాజిటివ్ వచ్చిన అత్యధికంగా జిహెచ్ఎంసి పరధిలో 406 ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
- Advertisement -