Saturday, November 23, 2024

వాతావరణ మార్పులతో వైరస్ రెక్కలు

- Advertisement -
- Advertisement -

Coronavirus wings with climate change

దగ్గు, జలుబు, జ్వరంతో ఆసుప్రతులకు జనం బారులు
టెస్టుల కోసం పట్టణ ఆరోగ్య కేంద్రాలకు తరలివస్తున్న స్దానికులు
అకాల వర్షాలతో కరోనా విస్తరించే అవకాశముంటున్న వైద్యులు
ప్రజలు లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా టెస్టులు చేసుకోవాలని అధికారుల సూచనలు

హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ విజృంభిస్తూ రోజు వందలాది పాజిటివ్ కేసులు నమోదైతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. జనం బయటకు వెళ్లాలంటే వైపు నుంచి మహమ్మారి సోకుతుందోనని జంకుతున్నారు. రెండు రోజల కితం గాంధీలో ఒక రోజు 35మంది చనిపోవడంతో వైరస్ తీవ్రత ఏవిధంగా ఉంటుందో అర్దమైతుంది. దీనికి తోడు వాతవరణంలో మార్పులు వచ్చి వర్షాలు కురువడంతో వైరస్ మరింత విస్తరించే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. జలుబు,దగ్గు, జ్వరం లక్షణాలు ఉన్నవారి సంఖ్య పెరుగుతుందని, వారం రోజుల పరిధిలో రెండుసార్లు అకాల వర్షాలు పడటంతో కరోనా రెక్కలు కట్టుకునే పరిస్దితి ఉంటుందని జిల్లా వైద్యాధికారులు భావిస్తున్నారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉదయం సూర్యరశ్మికి గంటపాటు నిలబడాలని, వేడినీళ్లు, గ్రీన్‌టీ తీసుకోవాలని సూచిస్తున్నారు.

కొన్ని ప్రాంతాల్లోని మార్కెట్లు, మాల్స్, వస్త్రదుకాణాలు, టీ సెంటర్ల వద్ద ప్రజలు గుంపులుగా చేరుతూ బౌతికదూరం పాటించకపోవడంతో చల్లబడ్డ వాతావరణంతో పక్కవారికి త్వరగా వైరస్ సోకుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గ్రేటర్ మూడు జిల్లాల పరిధిలో మంగళవారం పాజిటివ్ కేసులు జీహెచ్‌ఎంసీలో 361, మేడ్చల్ మల్కాజిగిరి 245, రంగారెడ్డి 206 కేసులు నమోదు కావడంతో ఈనెలావరకు రెండింతలు పెరగవచ్చని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా కరోనా టెస్టుల కోసం జనం బారులు కడుతున్నారు. గ్రేటర్ పరిధిలో 197 సెంటర్లు ఏర్పాటు చేయగా, ఒక్కొక్క ఆరోగ్య కేంద్రానికి 100మందికి పైగా వస్తున్నట్లు ఆసుపత్రులు సిబ్బంది వెల్లడిస్తున్నారు. ఒక పక్క టీకా కోసం జనం బారులు, మరోపక్క టెస్టులకు జనం రావడంతో వీరి ద్వారా మిగతవారికి వైరస్ సోకేతుందని, వైద్య సిబ్బంది వేర్వేరు గదులు ఏర్పాటు చేస్తే కొంతమేరకు కరోనా విస్తరించకుండా కట్టడి చేయవచ్చని వైద్య కేంద్రాలకు వచ్చి పలువురు సూచిస్తున్నారు. గత పదిరోజుల నుంచి పాజిటివ్ కేసులు పెరగడంతో ప్రైవేటు ఆసుపత్రుల పడకలు నిండిపోయాయి.

ప్రభుత్వ దవఖానలైన గాంధీ, టిమ్స్‌లో చికిత్స కోసం రోగులు వస్తున్నట్లు, వైరస్ లోడ్ ఎక్కువైన తరువాత రావడంతో చికిత్స అందించడం కష్టంగా మారిందని గాంధీ వైద్యులు పేర్కొంటున్నారు. కరోనా టెస్టు చేసిన తరువాత పాజిటివ్‌గా వచ్చిన వెంటనే ఆసుపత్రుల్లో చేరాలని, పరిస్దితులు తీవ్రంగా మారిన తరువాత వస్తే వైద్యసేవలు ఆశించిన స్దాయిలో అందించలేమంటున్నారు. సేకండ్ వేవ్‌లో వైరస్ సోకిన రోగులు ఆలస్యంగా కోలుకుంటున్నారని, మొదటి దశలో 14రోజల్లో రోగులు ఆరోగ్యంగా ఉండేవారిని, ప్రస్తుతం ఆసుపత్రిలో చేరుతున్న రోగులు 20రోజులకు పైగా చికిత్స పొందుతున్నట్లు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మరింత సమయం పడుతుందని వైద్య సిబ్బంది వివరిస్తున్నారు. కరోనా టీకా వచ్చిందని నగర ప్రజలు నిర్లక్షంగా ఉంటున్నారని, అత్యవసర పరిస్దితుల్లో బయటకు వెళ్లాలని, విందులు, వినోదాలకు దూరంగా ఉండి కోవిడ్ నిబంధనలు పాటిస్తే వైరస్ రాకుండా కాపాడుకోవచ్చని జిల్లా వైద్యాధికారులు సూచిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News