Friday, November 22, 2024

కాంగ్రెస్ సొంత డిజిటల్ వేదిక

- Advertisement -
- Advertisement -

Congress party is launching its own INC TV channel

ఐఎన్‌సి టీవీ 24 నుంచి ప్రసారాలు

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సొంతంగా యూ ట్యూబ్ టీవీని ఐఎన్‌సి టీవీ ఛానల్‌ను ప్రారంభిస్తోంది. దీనికి సంబంధించి డాక్టర్ అంబేద్కర్ జయంతి నేపథ్యంలో బుధవారం స్వరూప స్వభావాలతో కూడిన విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. ఆవిష్కరించారు. కాంగ్రెస్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షులు నీరజ్ కుందన్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుష్మితా దేవ్‌ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐఎన్‌సి టీవీ అధికారికంగా ఈ నెల 24వ తేదీన ఆరంభం అవుతుంది. ప్రజలకు నేరుగా పార్టీ సందేశాన్ని అందించేందుకు ఈ డిజిటల్ టీవీ వేదికను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖర్గే, రణదీప్ సూర్జేవాలా మాట్లాడారు. పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ఈ యూట్యూబ్ ఛానల్ ప్రజల ముందుకు తీసుకువస్తున్నట్లు , అణగారిన వర్గాల, బడుగు వర్గాల సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు ఈ డిజిటల్ వేదికను రూపొందించారు. రోజూ 8గంటల పాటు ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయి.

అయితే ఇవి శాటిలైట్, ఒటిటి ప్రక్రియలో ఉండవని తెలిపారు. తొలి దశలో హిందీ, ఆంగ్ల భాషలలో ప్రసారాలు ఉంటాయి. తరువాతి క్రమంలో ప్రాంతీయ భాషలలో వీటిని అందుబాటులోకి తెస్తారని నేతలు తెలిపారు. ప్రస్తుతం సమాజంలో పరిణామాలు సరైన రీతిలో వెలుగులోకి రావడం లేదని, అనుభవజ్ఞులైన జర్నలిస్టులతో ఈ ఐఎన్‌సి డిజిటల్ వేదిక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. కొద్ది సంవత్సరాలుగా ప్రధాన వార్త స్రవంతి పక్షపాతంతో వ్యవహరిస్తున్నట్లు , ఈ క్రమంలో ప్రతిపక్ష వాణి సరైన రీతిలో ప్రజల వద్దకు చేరుకోకుండా పోతోందని కాంగ్రెస్ విమర్శించింది. ఈ నేపథ్యంలో పార్టీ తమ సందేశాన్ని ప్రజలకు నేరుగా అందించాలని సంకల్పించిందని ఖర్గే, సూర్జేవాలా తెలిపారు. ఈ యూట్యూబ్ ఛానల్ ఆరంభ సూచకంగా తొలి షోగా బుధవారం మహాత్మా గాంధీపై ఓ లఘు చిత్రాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రసారం చేసింది. భారత స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో జర్నలిస్టుగా గాంధీ నిర్వర్తించిన కర్తవ్య దక్షతను తెలిపే డాక్యుమెంటరీగా దీనిని వేదిక నుంచి ప్రసారం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News