Saturday, November 23, 2024

విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉపశమనం

- Advertisement -
- Advertisement -
Delhi CM Arvind Kejriwal on CBSE exam decision
సిబిఎస్‌ఇ పరీక్షల నిర్ణయంపై కేజ్రీవాల్

న్యూఢిల్లీ: సిబిఎస్‌ఇ పరీక్షల సంబంధిత నిర్ణయం భారీ ఉపశమనం కల్గించిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. కొవిడ్ 19 కేసుల ఉధృతి దశలో పరీక్షల రద్దు వాయిదాల నిర్ణయం విద్యార్థులకు, తల్లిదండ్రులకు పెద్ద రిలీప్ ఇచ్చిందన్నారు. తాను కేంద్రం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

12 వ తరగతి రద్దు చేయాలి: ప్రియాంక

మొత్తం మీద సిబిఎస్‌ఇ పరీక్షలపై కేంద్రం తీసుకున్న నిర్ణయం హర్షదాయకం అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ చెప్పారు. కరోనా ఉధృతి నేపథ్యంలో విద్యార్థులపై కీలక పరీక్షల ఒత్తిడి ప్రభావం అనుచితం అవుతుందని అన్నారు. పదవ తరగతి పరీక్షలు రద్దు చేశారని, అయితే క్లాస్ 12కు సంబంధించి ఇప్పటికీ వారిని వాయిదా నిర్ణయంతో టెన్షన్‌లో పెట్టడం రిస్క్‌కు దారితీస్తుందని హెచ్చరించారు. వెంటనే ఈ పరీక్షల రద్దు గురించి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News