Friday, November 22, 2024

చేజేతులా ఓడిన సన్‌రైజర్స్

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్ సీజన్14లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆరు పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (1)ను సిరాజ్ వెనక్కి పంపాడు.

అయితే తర్వాత వచ్చిన మనీష్ పాండేతో కలిసి కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. ఈ జంటను విడగొట్టేందుకు బెంగళూరు బౌలర్లు చాలా సేపటి వరకు వేచి చూడాల్సి వచ్చింది. 37 బంతుల్లోనే ఏడు ఫోర్లు, సిక్స్‌తో 54 పరుగులు చేసిన వార్నర్‌ను జేమిసన్ ఔట్ చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్ వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. షాబాజ్ అహ్మద్ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి సన్‌రైజర్స్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. హర్షల్, సిరాజ్‌లు రెండేసి వికెట్లు తీసి బెంగళూరు విజయంలో తమవంతు పాత్ర పోషించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరును కెప్టెన్ విరాట్ కోహ్లి, మాక్స్‌వెల్ ఆదుకున్నారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి 4 ఫోర్లతో 33 పరుగులు చేశాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన మాక్స్‌వెల్ 41 బంతుల్లో ఐదు ఫోర్లు, మరో మూడు సిక్సర్లతో 59 పరుగులు చేశాడు. మిగతవారు ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు.

  IPL 2021:RCB win by 6 runs against SRH

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News