- Advertisement -
లక్నో: బాయ్ ఫ్రెండ్ తో ఫోన్లో మాట్లాడేందుకు అడ్డుపడుతున్నాడని ఓ అక్క తన తమ్ముడిని కడతేర్చిన దారుణ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. రాయ్ బరేలి చెందిన బాలిక (15) తరుచూ యువకుడితో మాట్లాడుతుండేది. గమనించిన తమ్ముడు(9) ఎంతసేపూ మాట్లాడుతావంటూ అడ్డుపడ్డాడు. విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు బాలికకు మందలించారు. ఇవాళ కూడా అడ్డుకోవడంతో కోపోద్రిక్తురాలైన బాలిక ఇయర్ ఫోన్స్ కేబుల్ తో మెడకు బిగించింది. దీంతో ఆ బాలుడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఆమెను జువైనల్ హోంకు తరలించినట్టు పోలీసులు వెల్లడించారు.
Sister kills brother with earphones in Raebareli
- Advertisement -