Friday, November 15, 2024

ఎల్‌ఓసి దాటిన వ్యక్తి పిఓకెకు అప్పగింత

- Advertisement -
- Advertisement -

Indian army sends civilian who crossed LOC

జమ్మూ: వాస్తవాధీన రేఖ(ఎల్‌ఓసి) మీదుగా భారత భూభాగంలోకి పొరపాటున ప్రవేశించిన ఒక వ్యక్తిని భారత సైనికులు మానవతా దృక్పథంతో పాక్ ఆక్రమిత కశ్మీరు(పిఓకె)లోకి పంపివేశారు. జమ్మూ కశ్మీరులోని పూంచ్ జిల్లాకు చెందిన పూంచ్-రావల్‌కోట్ సెక్టార్‌లోకి అనుకోకుండా ప్రవేశించిన గులామ్ ఖాదిర్ అనే వ్యక్తిని పిఓకె అధికారులకు భారత సైనికులు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 11.15 ప్రాంతంలో పిఓకెలోని ఘిమ్ గ్రామానికి చెందిన ఖాదిర్‌ను అక్కడి అధికారులకు అప్పగించినట్లు వారు చెప్పారు. ఏప్రిల్ 11వ తేదీన ఖాదిర్ పొరపాటున భారత భూభాగంలోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు.

Indian army sends civilian who crossed LOC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News