నల్లగొండ: నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 53.3 శాతం పోలింగ్ నమోదైంది. సాగర్ పోలింగ్ శనివారం ఉదయం 7గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కొనసాగనుంది. సాయంత్రం ఆరుగంటల తర్వాత కోవిడ్ బాధితులకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు అధికారులు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 2,20,300 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల పోలింగ్ కోసం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ సమయాన్ని రెండు గంటల పాటు పొడిగించింది. ఈ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి నోముల భగత్, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, బిజెపి నుంచి రవికుమార్ నాయక్ సహా మొత్తం 41 మంది బరిలో ఉన్నారు. టిఆర్ఎస్ ఎంఎల్ఎ నోముల నర్సింహయ్య అకాల మరణంతో సాగర్ లో ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.
సాగర్ లో ఒంటిగంట వరకు 53.3 శాతం పోలింగ్
- Advertisement -
- Advertisement -
Nagarjuna Sagar by-election polling 2021
- Advertisement -