- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతంగా ఉందని డిహెచ్ శ్రీనివాస రావు తెలిపారు. ప్రపంచంలో అగ్ర రాజ్యాలు కూడా కరోనా ముందు మోకరిల్లాయని, తెలంగాణలో శుక్రవారం అత్యధిక కేసులు నమోదయ్యాయని, పదిహేను రోజుల్లోనే కేసులు రెండింతలు అయ్యాయని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే కరోనా వ్యాపిస్తోందన్నారు. వంద ఏండ్ల కింద స్పానిష్ ఫ్లూ కూడా ఏడు కోట్ల మందిని బలితీసుకుందని, దాని నుంచి మనం ఇంకా గుణపాఠం నేర్చుకోలేదని, ప్రతీ ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని శ్రీనివాస రావు సూచించారు. కరోనా కట్టడికి కెసిఆర్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. టెస్టుల సంఖ్య రాబోయే రోజుల్లో ఇంకా పెంచుతామని వివరించారు. గతం కంటే రెట్టింపు సంఖ్యల్లో బెడ్లు అందుబాటుల్లో ఉన్నాయన్నారు.
- Advertisement -