మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే ప్రకటించాలని కోరుతూ చేపట్టిన దీక్షను వైఎస్ షర్మిల ఆదివారం విరమించారు. నిరుద్యోగ, అమరవీరుల కుటుంబ సభ్యులు షర్మిలతో దీక్ష విరమింపజేశారు. గత మూడు రోజులుగా లోటస్‌పాండ్‌లో దీక్ష చేస్తున్న షర్మిల ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు షుగర్ లెవల్స్ 88 నుంచి 62కు తగ్గాయని, బరువు 2 కిలోలు తగ్గినట్లు వెల్లడించారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయాలంటూ 72 గంటల దీక్ష చేస్తానని ప్రకటించిన షర్మిల.. గురువారం ఇందిరా పార్కు ధర్నాచౌక్ వద్ద దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, ధర్నాచౌక్ వద్ద సాయంత్రం వరకే అనుమతి ఉదంటూ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పాదయాత్రగా ఆమె లోటస్‌పాండ్‌కు బయలుదేరారు. మధ్యలోనే మరోసారి పోలీసులు అడ్డుకుని లోటస్ పాండ్‌కు తరలించడంతోవైఎస్ షర్మిల అక్కడే దీక్షను కొనసాగించారు.