చెన్నై: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్క ఓటమి కూడా లేకుండా ఐపిఎల్‌లో తొలిసారి వరుసగా మూడు మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఈ విజయంతో బెంగళూరు పాయింట్ల టేబుల్లో మళ్లీ టాప్ ప్లేస్‌కు చేరుకుంది. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించి అద్భుత విజయం సాధించింది. కెకెఆర్‌ను చిత్తు చేసి 38 పరుగుల తేడాతో గెలుపును కైవసం చేసుకుంది. తొలుత టాస్ గెలిచిన ఆర్సిబి బ్యాటింగ్ ఎంచుకుని అదరగొట్టింది. ఏబీ డివిలియర్స్(76: 34 బంతుల్లో.. 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), మ్యాక్స్‌వెల్(78: 49 బంతుల్లో.. 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) సూపర్ పార్ట్నర్ షిప్‌తో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు 4 వికెట్లకు 204 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు మంచి ఓపెనింగ్ దక్కినా.. వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో స్కోరు బోర్డు నెమ్మదించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగడం, వికెట్లు త్వరగా కోల్పోవడంతో తదుపరి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరిగింది. ఇక బెంగళూరు బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చివర్లో రన్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది.ఆఖరి ఓవర్లలో ఆండ్రూ రస్సెల్ (31: 20 బంతుల్లో.. 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కొన్ని బౌండరీలు కొట్టినా అప్పటికే కేకేఆర్ విజయానికి పూర్తిగా దూరమైంది. దీంతో 20 ఓవర్లు ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 166 పరుగులు మాత్రమే చేసింది. రసెల్ (20 బంతుల్లో 31),కెప్టెన్ ఇయాన్ మోర్గాన్( 23 బంతుల్లో29 పరుగులు) మాత్రమే టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆర్సిబిబౌలర్లలో కైల్ జేమిసన్ 3, హర్షల్ పటేల్, యజువేంద్ర చాహల్ 2 వికెట్లు పడగొట్టగా.. వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ డివిలియర్స్‌కు దక్కింది.
చెలరేగిన మ్యాక్సీ, డివిలియర్స్
అంతకు ముందు విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకున్నాడు. అయితే ఓపెనర్ కోహీ ్ల(5 పరుగులు) వన్‌డౌన్ రజత్ పాటిదార్(1) రెంబో ఓవర్లోనే పెవిలియన్ చేరడంతో ఆదిలోనే ఆర్సిబి ఎదురుదెబ్బ తగిలింది. అయితే దేవదత్ పడిక్కల్ (28 బంతుల్లో 25పరుగులు)తో కలిసి మ్యాక్సీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 86 పరుగులు జోడించారు.ఈ క్రమంలో జట్టు స్కోరు 95 పరుగుల వద్ద పడిక్కల్ ఔటయ్యాక .. డివిలియర్స్‌తో జోడీ కట్టిన మ్యాక్స్‌వెల్ దూకుడుగా ఆడాడు. అయితే కమిన్స్ వేసిన 17వ ఓవర్లో భారీ షాట్‌కు యత్నించి హర్భజన్ చేతికి చిక్కాడు. కేవలం 49 బంతుల్లో 78 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్ 3 సిక్స్‌లతో పాటుగా 9 ఫోర్లు బాదాడు.అప్పటికి ఆర్సిబి స్కోరు 4 వికెట్ల నష్టానికి 148 పరుగులు మాత్రమే అయితే చివరి మూడు ఓవర్లలో డివిలియర్స్ విధ్వంసం సృష్టించాడు. కైల్ జేమీసన్(11 నాటౌట్)తో కలిసి18 బంతుల్లో 56 పరుగులు సాధించాడు. రస్సెల్ వేసిన చివరి ఓవర్లో ఏకంగా 21 పరుగులు సాధించాడు. దీంతో ఆర్సిబి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి204 పరుగుల భారీ స్కోరు సాధించింది. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీయగా,కమిన్స్, ప్రసిధ్ చెరో వికెట్ పడగొట్టారు.
బెంగళూరు హ్యాట్రిక్ విజయం
- Advertisement -
- Advertisement -
- Advertisement -