Saturday, November 23, 2024

సీరం, బయోటెక్‌లకు రూ 4500 కోట్ల సాయం

- Advertisement -
- Advertisement -

Govt Approves Rs 4,500 Crore Credit to Serum Institute, Bharat Biotech

కొవిడ్ టీకాల కోసం కేంద్రం నిర్ణయం

న్యూఢిల్లీ : ప్రఖ్యాత ఔషధ ఉత్పత్తి సంస్థలు సీరం ఇనిస్టూట్, భారత్ బయోటెక్ సంస్థలకు రూ 4500 కోట్లు రుణసాయంగా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించిన మంజూరికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సోమవారం ఆమోదం తెలిపింది. ఈ రెండు సంస్థలు ఇప్పుడు భారీస్థాయిలో కొవిడ్ టీకాల ఉత్పత్తిలో ఉన్నాయి. అత్యధిక స్థాయిలో టీకాల ఉత్పత్తి సాగేలా చేసేందుకు ఈ రెండు సంస్థలకు కలిపి మొత్తం మీద రూ 4500 కోట్ల క్రెడిట్ అందుతుంది. ఇది ముందుగా కొవిడ్ 19 సంబంధిత వ్యవహారాల పర్యవేక్షక ప్రధాన మంత్రిత్వశాఖలకు చేరుతుంది. తరువాత ఈ రెండు కంపెనీలకు ప్రత్యేకించి వ్యాక్సిన్ల తయారీ కోసం ఈ నిధులను పంపిణీ చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి.

ఇందులో భాగంగా పుణేలోని సీరం ఇనిస్టూట్ ఆఫ్ ఇండియా (సిఐఐ)కి రూ 3000 కోట్లు, భారత్ బయోటెక్‌కు రూ 1500 కోట్లు అందుతాయి. సాధ్యమైనంత త్వరగా ఈ సంస్థలకు చెల్లింపులు జరుగుతాయని వివరించారు. నెలకు 100 మిలియన్ డోస్‌ల కొవిడ్ వ్యాక్సిన్ల లక్షం మించి ఉత్పత్తి చేయాలంటే తమకు ప్రభుత్వం నుంచి రూ 3000 కోట్లు గ్రాంట్‌కు సీరం సిఇఒ అధర్ పూనావాలా ప్రభుత్వానికి ఇటీవలే విజ్ఞప్తి చేశారు. టీకా ఉత్పత్తి లక్షం భారీస్థాయిలో ఉన్నప్పుడు అందుకు అనుగుణంగా మౌలిక సాధనాసంపత్తిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ప్రభుత్వ సాయం అవసరం అని ఈ యువ పారిశ్రామికవేత్త తెలిపారు. జూన్ నుంచి తమ సంస్థ నుంచి టీకాల ఉత్పత్తి సామర్థం పెంచుతామని కేంద్రానికి తెలిపారు.

పరిశ్రమల వారితో ఆర్థిక మంత్రి సమీక్ష దేశంలో కొవిడ్ పరిస్థితి, దీనిని ఎదుర్కొనే అంశాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పారిశ్రామిక సమాఖ్యలు, సంస్థల వారితో సమీక్ష నిర్వహించారు. కొవిడ్ నిర్వహణకు సంబంధించి పారిశ్రామికవర్గాలు వ్యక్తం చేస్తున్న పలు అంశాలు ఇందులో ప్రస్తావనకు వచ్చాయి. ఇండస్ట్రీ ఛాంబర్స్‌తో తాను అన్ని విషయాలను చర్చించినట్లు, పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయని, ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలను పారిశ్రామికవర్గాలు తెలియచేశాయని సీతారామన్ తెలిపారు. కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్రాలతో సమన్వయంతో వ్యవహరిస్తూ, పరిస్థితిని సవ్యంగా చేసేందుకు యత్నిస్తోందని తాను వారికి తెలిపినట్లు వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News