హైదరాబాద్: రేపటి నుంచి తెలంగాణలో సినిమా థియేటర్లు బంద్ కానున్నాయి. రాష్ట్రంలో కరోనా తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో థియేటర్లు, మల్టీప్లెక్స్ లను మూసివేయాలని తెలంగాణ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఏకగీవ్ర నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ ఉధృతి, ప్రేక్షకుల ఆరోగ్యం దృష్ట్యా థియేటర్లను బంద్ చేస్తున్నట్లు థియేటర్స్ అసోసియేషన్ పేర్కొంది. తెలంగాణలో మంగళవారం నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ ఉండనుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఫస్ట్ షో నుంచే థియేటర్లు బంద్ కానున్నాయి. అయితే, వకీల్ సాబ్ సినిమా ప్రదర్శించే థియేటర్లు మినహా మిగితా వాటిని మూసివేయనున్నట్లు థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ తెలిపింది. ఈ థియేటర్లలోనూ కర్ఫ్యూ నేపథ్యంలో సాయంత్రం వేసే ఫస్ట్ షో, సెకండ్ షోలు రద్దు చేశారు.
Cinema Theaters closed in Telangana from tomorrow