Saturday, November 23, 2024

ధోనీ కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్

- Advertisement -
- Advertisement -

Dhonis father mother test positive for covid19

రాంచీ: దేశంలో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తోంది. కరోనా కల్లోలానికి కొన్ని ఆస్పత్రులు శవాల దిబ్బలుగా మారుతున్నాయి. గత 24 గంటల్లో 2.95 లక్షల మంది కరోనా వైరస్ సోకగా 2023 మంది చనిపోయారు. రాజకీయ నాయకులు, సినిమా హీరోలు, క్రీడాకారులను కూడా కరోనా వైరస్ వదిలిపెట్టడంలేదు. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. ధోనీ తండ్రి పాన్ సింగ్, తల్లి దేవకి దేవి, కరోనా బారిన పడడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కుర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, తెలంగాణ సిఎం కెసిఆర్‌కు కరోనా వైరస్ సోకడంతో చికిత్స పొందుతున్నారు. ఐపిఎల్‌లో భాగంగా బుధవారం వాంఖేడ్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News