- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద ప్రభుత్వం కూలీ రేట్లను పెంచింది. కనీస కూలీ రేట్లను రూ.237నుంచి రూ.245కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఉపాధికూలీ రూ.210ఉండగా దీన్ని ఇటీవల రూ.237కు పెంచింది. అయతే గ్రామీణ ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఉపాధి కూలీరేట్లను పెంచాలని తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కూలీరేటును రూ.245కు పెంచాలని రాష్ట్రం చేసిన ప్రతిపాదనలు పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఆమోదం తెలిపింది. రూరల్ స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్‌ను వర్తింప చేస్తూ ఉపాధిహామీ పధకం కింద రూ.245కు పెంచిన కూలీరేట్లను ఈనెల ఒకటినుంచే అమల్లోకి తెస్తున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.
- Advertisement -