Friday, September 20, 2024

కోలుకున్న వారినీ కాటేస్తుంది

- Advertisement -
- Advertisement -

కోవిడ్ డెడ్‌లైన్ ఆరునెలలు
అమెరికా అధ్యయనంలో వెల్లడి
మానవాళికి కాలక్రమపు పిడుగుపాటు

Covid killed after treatment

న్యూఢిల్లీ: కొవిడ్ వచ్చి కొంతమేరకు నయం అయిన వారికి కూడా చావు ముప్పు వెంటాడుతూనే ఉంటుంది. కరోనా వైరస్‌కు చికిత్స పొంది అనారోగ్యంతో ఉంటూ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేని వారు ఆరు నెలల వరకూ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆరు నెలలు దాటితేకానీ వారు మరణం నుంచి, తీవ్రస్థాయి అనారోగ్యం నుంచి తప్పించుకోలేరు. ఈ విషయాలను వైరస్ సంబంధిత పరిశోధకులు తమ అధ్యయనంలో నిర్థారించారు. ఈ వివరాలు ఇప్పుడు జర్నల్ నేచర్‌లో వెలువరించారు. కరోనా వైరస్ ప్రపంచానికి ఇప్పుడు ఎనలేని ప్రమాద స్థాయిని తీసుకురావడంతో పాటు ప్రపంచ జనాభాకు వచ్చే కొద్ది సంవత్సరాలలో అత్యంత భారాన్ని మిగులుస్తుందని అధ్యయనంలో తేల్చారు. కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకుని ఆసుపత్రి నుంచి బయటపడ్డ వారు ఓ విధంగా ఆరోగ్యవంతులయినట్లు పరిగణించవచ్చు.

అయితే నామమాత్రంగా వైరస్ నుంచి బయటపడి, ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేని వారు తిరిగి సాధారణ జీవిత క్రమంలో పలు రకాల ఇక్కట్లు ఎదుర్కొవల్సి ఉంటుంది. ఆహారపు, దైనందిన జీవిత క్రమంలో పూర్తిస్థాయిలో అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఓ విధంగా చూస్తే తీవ్రస్థాయి గుండెపోట్లకు గురైన వ్యక్తి ఎటువంటి సున్నితమైన జీవనసరళితో ఉండాలో అదే పద్ధతిని వీరూ పాటించాల్సి ఉంటుంది. వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ (అమెరికా)కు చెందిన పరిశోధకులు కొవిడ్ ఒక్కటే కాకుండా సంబంధిత పలు తీవ్రస్థాయి వ్యాధుల తీవ్రత, వాటివల్ల తలెత్తే పరిణామాలపై విశ్లేషణలు చేశారు. దీర్ఘకాలిక వ్యాధులు తోడుగా ఈ వైరస్ సోకిన వారు చాలా కాలం పాటు అత్యంత క్లిష్టమైన అనారోగ్య పరిస్థితులను అనుభవించాల్సి ఉంటుంది.

తొలుత కరోనా వైరస్‌ను కేవలం శ్వాసవ్యవస్థను దెబ్బతీసే వైరస్‌గా భావించారు. అయితే క్రమేపీ ఇది మనిషి శరీరంలోని ప్రతి వ్యవస్థను, అంతకు మించి ఆక్సిజన్ సరఫరా ప్రక్రియను ప్రభావితం చేస్తుందని గుర్తించి వైద్యశాస్త్ర నిపుణులు కళ్లుతేలేశారు. కరోనా నిర్థారణ అయిన తరువాత వ్యక్తి ఆరు నెలల వరకూ ఇది నయం అయిపోయిందని అనుకోవడానికి వీల్లేదు. ఈ దశలో ఎప్పుడైనా ఇది పూర్తిస్థాయిలో వికటించి చివరికి ప్రాణాంతకం అవుతుందని పరిశోధక బృందానికి చెందిన వ్యాసకర్త జియాద్ అల్ అలీ తెలిపారు. ఆయన సంబంధిత సంస్థ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. తీవ్రస్థాయి కరోనా నుంచి కోలుకున్న తరువాత శరీరంలో అంతరించిపోకుండా ఉండే వైరస్ కణాలతో ఎప్పుడూ ముప్పు పొంచే ఉంటుంది. మనిషి అలవాట్లను ఆసరాగా చేసుకుని శరీరంలో వైరస్ మరింత బలపడి మనిషి కణజాలాన్ని దెబ్బతీస్తుందని ఇప్పటి పరిశోధనల్లో స్పష్టం అయింది. పలువురు కరోనా రోగులు ప్రత్యేకించి పూర్తిస్థాయిలో కోలుకున్నవారు, పూర్తిగా వైరస్ నుంచి బయటపడనివారి పరిస్థితిని వందల సంఖ్యలో బేరీజు వేసుకుని శాస్త్రీయ రీతిలో అధ్యయనం చేసుకుని పరిశోధకులు పలు విషయాలను నిర్థారించారు. ఒక్కసారి కొవిడ్ నిర్థారణ అయితే కనీసం ఆరు నెలలు దీని జీవ లక్షణాలు ఖచ్చితంగా మనిషి శరీరంలో అంటిపెట్టుకుని ఉంటాయి. ఈ విధంగా మనిషిలో శత్రువు పొంచి ఉన్నట్లే అవుతుందని, దీనిని గమనించి తగు విధంగా దీని పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News