- Advertisement -
హైదరాబాద్: రాష్ట్రంలో రాగల మూడ్రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం మరట్వాడా ప్రాంతంలో ఉపరిత ద్రోణి ఏర్పడింది. కర్నాటక మీదగా దక్షిణ కోస్తా తమిళనాడు వరకు ఆవర్తనం కొనసాగుతోంది. సముద్రమట్టానికి 0.9కి.మీ ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వీటి ప్రభావంతోనే తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే, శుక్రవారం రాత్రి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.
Rains in Telangana for next three days
- Advertisement -