Thursday, November 14, 2024

ఆక్సిజన్ దిగుమతి

- Advertisement -
- Advertisement -

Indian Air Force airlifts cryogenic oxygen container from Singapore

 

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉధృతి తీవ్రరూపం దాల్చిన దృష్టా ఆసుపత్రులను వెంటాడుతున్న ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు ఆక్సిజన్ రవాణాకు ఉపయోగించే నాలుగు క్రయోజెనిక్ ట్యాంకులు శనివారం ఉదయం సింగపూర్ నుంచి యుద్ధ విమానాలలో భారత్‌కు బయల్దేరాయి. భారతీయ వైమానిక దళానికి చెందిన భారీ రవాణా విమానంలో నాలుగు క్రయోజెనిక్ ట్యాంకులను సింగపూర్ నుంచి రప్పిస్తున్నట్లు హోం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు శనివారం తెలిపారు. ఢిల్లీ శివార్లలోని హిందోన్ వైమానిక స్థావరం నుంచి ఐఎఎఫ్‌కు చెందిన సి-17 యుద్ధ విమానం శనివారం ఉదయం బయల్దేరి వెళ్లిందని ఆయన తెలిపారు. సింగపూర్‌లోని చాంగి విమానాశ్రయంలో నాలుగు ట్యాంకులను లోడ్ చేసుకున్న అనంతరం ఈ విమానం సాయంత్రానికి పశ్చిమ బెంగాల్‌లోని పానగఢ్ వైమానిక స్థావరానికి చేరుకోనున్నదని ఆయన తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News