చెన్నై: నగ్నంగా వీడియో తీసి తనని వేధింపులకు గురి చేస్తున్నాడని టివి సీరియల్ సహాయ దర్శకుడిపై బుల్లితెర నటి జెన్నిఫర్ (24) స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంఘటన తమిళనాడులోని మనాలి ప్రాంతం చిన్న సెక్కాడు ప్రాంతంలో జరిగింది. 2019వ సంవత్సరంలో శరవణన్ ను జెన్నిఫర్ పెళ్లి చేసుకుంది. వారి మధ్య మనస్పర్థలు రావడంతో వేరు వేరుగా జీవిస్తున్నారు. గత ఐదేళ్ల నుంచి టివి సీరియల్ లో నటిస్తున్నారు. టివి సీరియల్ సహాయ దర్శకుడు నవీన్ కుమార్ ఆమె సహజీవనం చేస్తోంది. నవీన్ కుమార్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడంతో ప్రతి రోజు ఆమెను వేధిస్తు ఉండేవాడు. ఒక రోజు కారులో ఆమెను నగ్నంగా తీసిన వీడియో అతడి వద్ద ఉన్నాయి. ఈ విషయం అతడి తల్లి దృష్టికి తీసుకెళ్లగా అతడు చెప్పినట్టు నడుచుకోవాలని హెచ్చరించింది. దీంతో నవీన్ కుమార్ పై మనాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నవీన్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అతడి తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపింది.