Saturday, November 23, 2024

కోవిడ్ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం: 27 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Iraqi hospital fire kills 27 patients

బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అల్ ఖతిబ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు పేలి 27 మంది రోగులు మృతి చెందారు. మరో 46 మంది గాయపడ్డారు. ఘటన జరిగిన ప్రదేశంలో చాలా వరకు కాలిపోయిన మృతదేహాలు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 120 మంది రోగులు ఉన్నారని, వారిలో 90 మందిని భద్రతా సిబ్బంది రక్షించినట్టు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్టు సమాచారం. ఈ సంఘటనలో గాయపడని రోగులను కూడా ఆసుపత్రి నుండి బదిలీ చేస్తున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశాయని అధికారులు వెల్లడించారు

Iraqi hospital fire kills 27 patients

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News