మన తెలంగాణ, హైదరాబాద్ : నగరంలో వేర్వేరు బ్లడ్ గ్రూపులున్న వ్యక్తుల మధ్య కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌పై నిర్వహించి తమ డాక్టర్లు చరిత్ర సృష్టించారని కిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. అస్సాంకు చెందిన 40ఏళ్ల ఆషిమ్ దాస్‌కు జన్యుపరమైన సమస్యలతో కిడ్నీలు పెయిలయ్యాయి. రెండేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. మళ్లీ సమస్య రావడంతో ట్రాన్స్‌ప్లాంటేషనే ప్రత్నామ్నామయని డాక్టర్లు తేల్చి చెప్పారు.వెంటనే ఆయన భార్య కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చినా ఇద్దరి బ్లడ్ గ్రూపులు మ్యాచ్ కాలేదు.
ఆషిమ్దాస్ది బీ పాజిటివ్ కావడంతో ఆయన భార్యది ఏపాజిటివ్ రక్తం. దీంతో వారు కిమ్స్ ఆసుపత్రికి వైద్యులు సంప్రదించారు. ఆసుపత్రి వైద్యనిపుణులు పరీక్షలు చేసిన ట్రాన్స్‌ప్లాంట్ చేయడానికి సిద్దమైయ్యారు. ఈసందర్భంగా ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్ డా. ఇ.రవి మాట్లాడుతూ ఈట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే డోనర్‌ను రెసిస్ట్ చేసే యాంటీ బాడీస్ షేషంట్ బాడీలో ఉండకూదన్నారు. తాను నెప్రాలజిస్ట్ హిమదీప్తి కలిసి ప్లాస్మా ఫెరిసిస్ అనే ప్రక్రియ ద్వారా పేషంట్లో ఉన్న అలాంటి యాంటీ బాడీస్‌ను క్రమంగా తగ్గించామని చెప్పారు. ఈప్రక్రియ దాదాపు రెండు వారాలు పట్టిందని, పూర్తిచయ్యేసరికి రోగికి డోనర్‌ను వ్యతిరేకించే యాంటీ బాడీస్ బాగా తగ్గినట్లు తెలిపారు. తరువాత డా. శర్బేస్ సహారియా ట్రాన్స్‌ప్లాంటేషన్ విజయవంతంగా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.