- Advertisement -
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 82మంది చనిపోగా, 110మంది గాయపడ్డారు. ఇబ్న్ అల్‌ఖతీబ్ హాస్పిటల్లో శనివారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సోమవారం ఉదయం వరకల్లా మంటల్ని ఆర్పారని అధికారులు తెలిపారు. మృతుల్లో 28మంది కరోనాకు వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నవారని అధికారులు తెలిపారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఆక్సిజన్ సిలిండర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. హాస్పిటల్ ప్రమాదం నుంచి 200మందిని కాపాడినట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. ఇరాక్‌లోనూ సెకండ్‌వేవ్ ఉధృతి ఉన్నది. ఇరాక్‌లో ప్రస్తుతం రోజువారీ సగటు కేసుల సంఖ్య 8000గా ఉన్నది. ఇప్పటివరకు మొత్తం లక్ష కేసులు, 15,200 మరణాలు నమోదయ్యాయి.
- Advertisement -