Saturday, November 23, 2024

వ్యాక్సిన్‌కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

- Advertisement -
- Advertisement -

వ్యాక్సిన్‌కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
18 ఏళ్ల పైబడిన వారంతా కొవిన్‌పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని అధికారుల వెల్లడి
ఒత్తిడి నియంత్రించడం కోసమే ఈ ఏర్పాటు
రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖలు

న్యూఢిల్లీ: దేశంలో 18 నుంచి 45 ఏళ్ల వయసు కలిగిన వారందరికీ మే 1వ తేదీ నుంచి వ్యాక్సిన్ అందించనున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, వ్యాక్సిన్ తీసుకునే వారు తప్పనిసరిగా కొవిన్ వెబ్ పోర్టల్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాల్సిందేని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 45 సంవత్సరాలు పైబడిన వారు కూడా కొవిన్ వెబ్ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకోవాలి. అయితే ఆధార్ కార్డుతో నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లినా వైద్య సిబ్బంది పేరు, ఇతర వివరాలు నమోదు చేసుకుని టీకా ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో మే 1నుంచి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేలా కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. ‘వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి తెచ్చే క్రమంలో ఒక్కసారిగా ఒత్తిడి పెరుగుతుంది. దీన్ని నియంత్రించడానికే కొవిన్ పోర్టల్‌లో వివరాల నమోదు తప్పనిసరి చేశాం. నేరుగా ఆయా కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవడాన్ని ప్రస్తుతానికి అంగీకరించం’ అని ఒక అధికారి తెలిపారు.

18 సంవత్సరాలు దాటిన వారందరూ కొవిన్‌పోర్టల్, ఆరోగ్యసేతు యాప్ యాప్ ద్వారా ఏప్రిల్ 28నుంచి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. మరోవైపు వ్యాక్సిన్ కంపెనీలు ఇప్పటికే తమ వ్యాక్సిన్ ధరలను ప్రకటించగా తెలుగు రాష్ట్రాలతో పాటుగా పలు రాష్ట్రాలు ఉచితంగా వ్యాక్సిన్ అందించనున్నట్లు ప్రకటించాయి. భారత్ బయోటెక్ ‘కొవాగ్జిన్’ టీకాను ప్రైవేటు ఆస్పత్రులకు ఒక్కో డోసు రూ.1200కు, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.600కు ఇస్తుంది. ఇక, కొవిషీల్డ్ కొత్త ధరల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400కు, ప్రైవేటు ఆస్పత్రులకు రూ.600కు అందించనుంది. అయితే కేంద్రప్రభుత్వం మాత్రం ఎప్పటిలాగే రూ.150కు కొనుగోలు చేస్తుంది. కాగా మూడో విడత వ్యాక్సినేషన్‌కు సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు. ప్రజలు తమకు నచ్చిన వ్యాక్సిన్‌ను ఎంపిక చేపుకోవడానికి వీలుగా ప్రతి ప్రైవేటు కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రం కొవిన్ పోర్టల్‌లో వ్యాక్సిన్ టైపు, దాని ధర వివరాలను స్పష్టంగా తెలియజేయాలని కూడా ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

Registration must to get Covid 19 vaccine: Centre

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News