- Advertisement -
న్యూఢిల్లీ : అమెరికా నుంచి రెండు రోజుల్లో రెండు ఎయిర్ ఇండియా విమానాల ద్వారా దాదాపు 600 ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లను తీసుకురావడమౌతుందని విమానయాన సంస్థ వర్గాలు తెలిపాయి. ప్రైవేట్ ఆస్పత్రుల వారు ఈ ఆర్డరు ఇచ్చారని చెప్పాయి. దేశం లోని వివిధ ఆస్పత్రులు ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్నాయి. మరికొన్ని వారాల్లో 10 వేల ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లను తీసుకురాడానికి ఎయిర్ ఇండియా సన్నాహాలు చేస్తోందని చెప్పాయి. ఆక్సిజన్ తదితర అత్యవసర వైద్య అవసరాలు ఏమైనా సరే తీసుకురాడానికి తాము కీలక పాత్ర వహిస్తామని అధికార ప్రతినిధి తెలిపారు.
- Advertisement -