- Advertisement -
న్యూఢిల్లీ : గగన్‌యాన్ మిషన్ పర్యవేక్షణకు సహాయంగా డేటా రిలే శాటిలైట్‌ను ఇస్రో త్వరలో ప్రయోగించనున్నది. గగన్‌యాన్ ప్రారంభానికి ముందు ఈ శాటిలైట్‌ను ప్రయోగిస్తారు. ఈ శాటిలైట్ ద్వారా వ్యోమగాములు దిగువ భూ కక్షకు వెళ్తారు. గగన్‌యాన్ మొదటి ఘట్టం డిసెంబర్‌లో మానవ రహితంగానే ప్రారంభమౌతుంది. వ్యోమగాములతో కూడిన మొదటి వ్యోమనౌక ప్రయోగానికి ముందుగానే ఈ శాటిలైట్‌ను పంపడమౌతుందని ఇస్రో వివరించింది. రూ.800 కోట్ల వ్యయంతో ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టు పని సాగుతోందని ఆయా వర్గాలు తెలిపాయి. కక్షలో ఉండే శాటిలైట్లు భూ కేంద్రం పై స్పష్టమైన దృశ్య గోచరం లేకుంటే సమాచారాన్ని భూమికి అందించలేవని, అందువల్ల డేటా రిలే శాటిలైట్ సమాచారాన్ని అందించే మార్గంగా ఉపయోగపడుతుందని వివరించారు.
- Advertisement -