- Advertisement -
మద్రాస్: దేశంలో కరోనా విజృంబిస్తున్న వేళ ర్యాలీలకు అనుమతి ఇవ్వడంపై కేంద్ర ఎన్నికల సంఘంపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల అధికారులపై హత్య కేసులు నమోదు చేయాలని సిజె వ్యాఖ్యనించారు. కోవిడ్ రెండో దశకు ఎన్నికల సంఘానిదే బాధ్యతని మద్రాస్ హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో కరోనా ఆంక్షల అమలులో ఇసి విఫలమైందని హైకోర్టు పేర్కొంది. ప్రచారాల వేళ ఎన్నికల అధికారులు వేరే గ్రహంలో ఉన్నారా..? అని సిజె ప్రశ్నించారు. ఓట్ల లెక్కింపు రోజైనా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. లెక్కింపు రోజు ఏం చేయబోతున్నారో ప్రణాళిక ఇవ్వాలని తెలిపింది. ఏప్రిల్ 30లోగా లెక్కింపు ప్రణాళిక అందివ్వాలని కోరింది. ప్రణాళిక ఇవ్వకపోతే ఓట్ల లెక్కిపు ఆపేస్తామని కోర్టు హెచ్చరించింది.
Madras HC says EC responsible for second COVID wave
- Advertisement -