Saturday, November 23, 2024

బెంగాల్‌లో ఒంటిగంట వరకు 54.56 శాతం పోలింగ్

- Advertisement -
- Advertisement -

West Bengal Assembly Elections 2021

కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఏడవ దశ ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. బెంగాల్లో ఐదు జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 54.56 శాతం పోలింగ్ న‌మోదైంద‌ని అధికారులు వెల్ల‌డించారు. చెదురుమొదురు ఘ‌ట‌న‌లు మిన‌హా బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌శాంతంగా కొన‌సాగుతుంది. ఓట‌ర్లు ఉద‌యం నుంచే పోలింగ్ కేంద్రాల ద‌గ్గ‌ర బారులు తీరారు. బెంగాల్‌లో మొత్తం ఎనిమిది విడుత‌ల ఎన్నిక‌ల జరుగనున్న సంగతి తెలిసిందే. 29న తుది విడుత పోలింగ్ జ‌రుగ‌నున్న‌ది. మే 2న ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌నున్నారు.

West Bengal Assembly Elections 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News