Friday, November 22, 2024

హైదరాబాద్‌కు పరీక్ష!  నేడు చెన్నైతో కీలక పోరు

- Advertisement -
- Advertisement -

CSK vs SRH: Who will win today’s IPL 2021 match?

న్యూఢిల్లీ: వరుస ఓటములతో సతమతమవుతూ పాయింట్ల పట్టికలో అట్టడుగ కొనసాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బుధవారం జరిగే కీలక మ్యాచ్‌లో అగ్రస్థానంలో నిలిచిన చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది. ఇప్పటికే నాలుగు మ్యాచుల్లో ఓటమి పాలైన సన్‌రైజర్స్ ప్లేఆఫ్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుం ది. నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ కూడా హైదరాబాద్‌కు కీలకమే. మరోవైపు చెన్నై మాత్రం వరుస గెలుపులతో జోరుమీదుంది. తొలి మ్యాచ్ లో ఓటమి పాలైన తర్వాత సిఎస్‌కె ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది. వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కిందటి మ్యాచ్‌లో బలమైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడిం చి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చెన్నై సమతూకంగా కనిపిస్తోంది.

బ్యాటింగే సమస్య..

మరోవైపు హైదరాబాద్‌ను బ్యాటింగ్ సమస్య వెంటాడుతోంది. నిలకడలేని బ్యాటింగ్‌తో వరుస ఓటములు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ డేవిడ్ వార్నర్ వైఫల్యం జట్టుకు ప్రధాన సమస్యగా తయారైంది. ఒకటి రెండు మ్యాచుల్లో తప్పిస్తే వార్నర్ ఘోరంగా విఫలమయ్యాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన వార్నర్ వరుస గా విఫలం అవుతుండడంతో జట్టు బ్యాటింగ్ సమస్యలు మరింత పెరిగాయి. బెయిర్‌స్టో మెరు పు ఆరంభాన్ని ఇస్తున్నా దాన్ని భారీ స్కోర్లుగా మలచడంలో వైఫల్యం చెందుతున్నాడు.

బెయిర్‌స్టో చివరివరకు క్రీజులో ఉంటే మాత్రం హైదరాబాద్ బ్యాటింగ్ సమస్యలు చాలా వరకు తీరిపోతాయి. ఇక కేన్ విలియమ్సన్ రూపంలో మరో మెరుగైన అస్త్రం జట్టుకు అందుబాటులో ఉంది. కిందటి మ్యాచ్‌లో విలియమ్సన్ అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. కేన్ తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో అలరిస్తే హైదరాబాద్‌కు భారీ స్కోరు కష్టం కాకపోవచ్చు. అయితే యువ ఆటగాళ్ల వైఫల్యం జట్టుకు ఇబ్బందికరంగా పరిణమించింది. అంది వచ్చిన అవకాశాన్ని వీరు సద్వినియోగం చేసుకోలేక పోతున్నారు. విరాట్ సింగ్, అభిషేక్ శర్మ, సమద్ తదితరులతో ఇప్పటికే పలు అవకాశాలు లభించాయి. అయినా ఫలితం లేకుండా పోయింది. ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్ తదితర జట్లకు చెందిన యువ క్రికెటర్లు అద్భుత బ్యాటింగ్‌తో అలరిస్తుండగా హైదరాబాద్ యువ ఆటగాళ్లు మాత్రం విఫలమవుతున్నారు.

సీనియర్ ఆటగాడు కేదార్ జాదవ్ కూడా తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాడు. ఈసారైన అతను తన బ్యాట్‌కు పనిచెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక విజయ్ శంకర్ ఇటు బ్యాట్‌తో అటు బంతితో విఫలమవుతున్నా అతన్ని జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారో అంతుబట్టకుండా మారింది. ఇప్పటికైనా అతని స్థానంలో మరో బ్యాట్స్‌మెన్‌కు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రషీ ద్ ఖాన్ బంతితో బాగానే రాణిస్తున్నా బ్యాట్‌తో విఫలమవుతున్నా డు. బ్యాటింగ్ కూడా మెరుగు పరుచుకుంటే బాగుంటుంది. ఇక ఈ మ్యాచ్‌లో కూడా హైదరాబాద్ బౌలింగ్‌పైనే ఆశలు పెట్టుకుంది.

ఎదురే లేదు..

ఇక చెన్నైకు ఈ సీజన్‌లో ఎదురే లేదని చెప్పాలి. వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచి జోరుమీదుంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలుపే లక్షంగా పెట్టుకుంది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్ ప్రతి మ్యాచ్‌లో శుభారంభం అందిస్తున్నారు. ఇద్దరు విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. కిందటి మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టాడు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. సురేశ్ రైనా, మొయిన్ అలీ, బ్రావో, రాయుడు, ధోనీ తదితరులతో చెన్నై బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఇక దీపక్ చాహర్, శార్దూల్, ఇమ్రాన్ తాహిర్, జడేజాలతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా మారింది. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా చెన్నై ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News