- Advertisement -
దుబాయ్: పెర్షియన్ గల్ఫ్‌లో తమ గస్తీ నౌకకు అత్యంత సమీపానికి వచ్చిన ఇరాన్‌కు చెందిన పారామిలిటరీ రివల్యూషరీ గార్డు నౌకలను హెచ్చరిస్తూ అమెరికన్ యుద్ధనౌక కాల్పులు జరిపినట్లు అమెరిక నావికాదళం బుధవారం తెలిపింది. పెర్షియన్ గల్ఫ్‌లోని అంతర్జాతీయ జలాలలో సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ని అమెరికా నావికాదళం విడుదల చేసింది. ఈ వీడియోలో కొంచెం దూరంలో లైట్లు కనిపిస్తుండగా తుపాకీ పేలిన శబ్దం వినిపిస్తోంది. అయితే ఈ సంఘటనపై ఇరాన్ నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. అమెరికా కోస్ట్ గార్డు పెట్రోల్ బోటు యుఎస్‌సిజిసి బారన్‌ఆఫ్‌కు దాదాపు 62 మీటర్ల సమీపానికి ఇరాన్ నౌకలు చేరుకున్నాయని, వీటిని నిలువరించడానికి హెచ్చరికగా కాల్పులు జరిపామని అమెరికా నావికాదళం తెలిపింది. దీంతో ఇరాన్ నౌకలు అక్కడ నుంచి తరలిపోయాయని పేర్కొంది.
- Advertisement -