న్యూఢిల్లీ: కరోనా వైరస్ సోకి ఆసుపత్రులలో పడకలు దొరకక నానా అవస్థలు పడుతున్న న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి కోవిడ్ వార్డులలో పడకలు రిజర్వ్ చేయాలని కొందరు న్యాయవాదులు గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రులలో అడ్మిషన్లు దొరకక న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు రాసిన ఒక లేఖలో ద్వారకా కోర్టు బార్ అసోసియేషన్ తెలిపింది.
12 లక్షలకు పైగా జనాభా ఉన్న ఢిల్లీ శివార్లలోని ద్వారకా టౌన్‌షిప్ చుట్టుపక్కల గాని ద్వారక కోర్టు పరిధిలో కాని ప్రభుత్వ ఆసుపత్రి ఏదీ లేదని వారు తెలిపారు. కరోనా సోకిన న్యాయవాదులు, న్యాయమూర్తులు, కోర్టు సిబ్బందితోపాటు వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో అడ్మిషన్ దొరక్క ఇబ్బంది పడుతున్నారని వారు పేర్కొన్నారు. ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకున్న 17,000 పడకల సామర్ధం గల ఇందిరా గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించి అందులో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి పడకలను రిజర్వ్ చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వైపి సింగ్ ముఖ్యమంత్రికి సూచించారు.
Lawyers request Kejriwal to reserve beds for Judges