Monday, November 25, 2024

స్టాఫ్‌నర్సుల ఎంపిక జాబితా

- Advertisement -
- Advertisement -

స్టాఫ్‌నర్సుల ఎంపిక జాబితా.. 2,418 మంది నియామకం
వెబ్‌సైట్‌లో ఫలితాలను పొందుపరిచాం : టిఎస్‌పిఎస్‌సి

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 2,418 స్టాఫ్ నర్సు పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు గురువారం టిఎస్‌పిఎస్‌సి స్టాఫ్‌నర్సు పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో మొత్తం 3,311 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా, 2,418 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కమిషన్ తెలిపింది. అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేకపోవడం వల్ల మిగతా 893 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయలేదని కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ.వాణి ప్రసాద్ పేర్కొన్నారు. ఈ పోస్టుల భర్తీకి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 5 వరకు 3,172 మందికి, ఏప్రిల్ 24న 204 మంది అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించినట్లు తెలిపారు. స్టాఫ్ నర్సు ఫోస్టుల ఫలితాలను టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.

TSPSC Staff Nurse Merit list list 2021 released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News