Sunday, November 24, 2024

శ్రమజీవులతోనే అభివృద్ధి సాధ్యమైంది: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

KCR wishes to Labour in May day

హైదరాబాద్: ఆర్‌టిసి, జిహెచ్‌ఎంసి, మత్స్య , చేనేత, భవన నిర్మాణ రంగాల కార్మికుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా కార్మిక, కర్షక, కష్ట జీవులకు కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అవార్డులు, రివార్డులను కూడా అందజేస్తోందని, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాల్లో లబ్ధిదారుల గుర్తింపులో కార్మికులకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ఆర్‌టిసి, కార్మికులకు వేతనాలు, పదవీ విరమణ వయసు పెంపుతో పాటు జిహెచ్‌ఎంసి కార్మికులకు నిర్దిష్ట పని వేళలు, వారి ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని, గొర్రెల పెంపు, చేనేత, మత్స్యరంగం, కల్లుగీత, దోబీ, నాయి బ్రాహ్మణ తదితర కుల వృత్తి రంగాలలో కార్మికుల సంక్షేమం, ఉపాధి కల్పనకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని కెసిఆర్ వివరించారు.

రాష్ట్రంలోని నిర్మాణరంగం కార్మికులకు తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ బోర్డు ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. శ్రమజీవులు చెమట చుక్కలు రాలిస్తేనే అభివృద్ధి సాధ్యమైందన్నారు. మానవజాతి పురోగతి, కష్టం చేసే చేతుల మీదినించే కొనసాగుతూ వస్తుందన్నారు. వివిధ ప్యాక్టరీల్లో పని చేసే కార్మికులతో పాటు వ్యవసాయాధారిత భారత దేశంలో అధిక జనాభా భూమినే నమ్ముకుని బతుకుతున్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News