Friday, November 22, 2024

తొలిరౌండ్ లో నోముల భగత్ ఆధిక్యం

- Advertisement -
- Advertisement -

nagarjuna sagar by election results 2021

నల్లగొండ: నాగార్జునసాగర్‌ ఉపఎన్నికల కౌంటింగ్‌ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతుంది. తొలిరౌండ్ లో టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ 1,475 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. రెండు హాళ్లల్లో ఏడు టేబుళ్ల చొప్పున మొత్తం 14 టేబు‌ళ్లపై లెక్కింపు ఏర్పాటు చేశారు. మొత్తం 346 పోలింగ్‌ కేంద్రాలు ఉండ‌డంతో 25 రౌండ్లలో లెక్కింపు పూర్తి‌కా‌నుంది. సాయంత్రం 7 గంటల వరకు అధి‌కా‌రి‌కంగా విజే‌తను ప్రక‌టించే అవ‌కాశం ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. కౌంటింగ్‌లో మొదట పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కింపు చేపట్టారు. కౌంటింగ్‌లో 400 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. తెలంగాణలో సాగర్‌ ఉప ఎన్నికల ఫలితంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. టిఆర్‌ఎస్‌ నేత నోముల నర్సింహయ్య మృతితో ఉప ఎన్నిక జరిగింది. ఎన్నికల్లో 41 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా టిఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌, కాంగ్రెస్‌ నేత జానారెడ్డి మధ్య పోటీ హోరాహోరీగా జరుగుతుంది.

nagarjuna sagar by election results 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News