Friday, November 22, 2024

నలుగురు వ్యోమగాములను భూమికి తీసుకొచ్చిన స్పేస్ ఎక్స్

- Advertisement -
- Advertisement -

SpaceX, which brought four astronauts to Earth

 

కేప్‌కెనవరెల్ (యుఎస్ ): అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి నలుగురు వ్యోమగాములను స్పేస్ ఎక్స్ ఆదివారం తీసుకొచ్చింది. ఫ్లోరిడా లోని పనామా సిటీ తీరంలో మెక్సికో జలసంధిలో డ్రాగన్ క్యాప్సూల్ పారాచ్యూట్ ఈ నలుగురు వ్యోమగాములను ఆదివారం తెల్లవారు జాము 3 గంటలకు ముందుగా దింపింది. ఈ విధంగా చీకటిలో అమెరికా వ్యోమగాములను కిందకు దింపడం 1968 డిసెంబర్ 27 న అపోలో 8 చంద్రయాత్ర తరువాత ఇదే. ఎలాన్ మస్క్ కంపెనీకి ఇది రెండో వ్యోమగాముల విమానం. ఆరున్నర గంటల్లో వీరు అదే రీసైలియెన్స్ పేరుగల కాప్యూల్‌లో భూమికి చేరుకోగలిగారు. ఈ నలుగురు వ్యోమగాముల్లో ముగ్గురు అమెరికన్లు కాగా, ఒకరు జపాన్‌కు చెందిన వారు. గత నవంబర్‌లో వీరు ఇదే కాప్యూల్‌లో నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి బయలు దేరారు. ఇదివరకటి అమెరికా వ్యోమగాములు 84 రోజుల పాటు అంతరిక్ష యాత్ర చేసినట్టు రికార్డు కాగా, వీరు 167 రోజులు యాత్ర చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News