ముంబయి: కోవిడ్ మృతదేహం దగ్గరకు వస్తుందంటే చాలు ప్రజలు అమడ దూరం పరుగులు తీసున్నారు. కోవిడ్ సోకిన మృతదేహం వద్దకు కుటుంబ సభ్యులు వెళ్లడానికి కూడా సాహసించడం లేదు. కొన్ని గ్రామాల ప్రజలు తమ ఊరి పరిధిలోకి కరోనా సోకిన మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించొద్దని ఆంక్షలు విధిస్తున్నారు. మహారాష్ట్రలోని సతారా జిల్లా ఫల్టాన్ మున్సిపల్ పరిధిలో ఓ శ్మశాన వాటికలో కరోనా మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. సగం కాలిన మృతదేహాన్ని ఓ వ్యక్తి పీక్కుతిన్నాడు. సగం కాలిన మాంసం ముద్దలను చేతుల్లోకి తీసుకొని పీక్కుతిన్నాడు. ఇది గమనించిన స్థానికులు మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు అక్కడికి చేరుకునేలోపు సదరు వ్యక్తి పారిపోయాడు. సాయంత్రంలోపు ఆ వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. సదరు వ్యక్తి మానసిక స్థితి సరిగాలేదని అధికారులు పేర్కొన్నారు. అతడిని చికిత్స నిమిత్తం మానసిక వైద్యుడు వద్దకు తరలించారు. పరీక్షలు జరిపిన అనంతరం అతడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
కరోనా మృతదేహాన్ని పీక్కుతిని…
- Advertisement -
- Advertisement -
- Advertisement -