- Advertisement -
ఐసిఎంఆర్ నూతన మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: కొవిడ్19 పరీక్షల విషయంలో భారత వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్) నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ర్యాట్ లేదా ఆర్‌టిపిసిఆర్ పరీక్షలో ఓసారి పాజిటివ్‌గా నిర్ధారణ అయితే, మరోసారి ఆర్‌టిపిసిఆర్ పరీక్ష అవసరంలేదని స్పష్టం చేసింది. దేశంలో కేసులు పెరుగుతున్నందున పరీక్షల సంఖ్యను పెంచాల్సి ఉన్నదని, ల్యాబ్‌లపై అదనపు భారాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐసిఎంఆర్ పేర్కొన్నది. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యే పేషెంట్లకు కూడా తిరిగి పరీక్షలు అవసరం లేదని తెలిపింది. అంతర్‌రాష్ట్ర ప్రయాణికులకు ఆర్‌టిపిసిఆర్ పరీక్షలో నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేయడాన్ని కూడా తొలగించాలని ఐసిఎంఆర్ సూచించింది. దీంతో, ల్యాబ్‌లపై భారం తగ్గుతుందని తెలిపింది.
- Advertisement -