Saturday, November 23, 2024

సిఎం కావాలని అనుకోలేదు

- Advertisement -
- Advertisement -

Etela Rajender press meet in Huzurabad

 మంత్రుల విమర్శలు వారి విజ్ఞతకే వదిలేస్తా…
 ఐఎఎస్‌లు అదరాబాదరా నివేదిక ఇచ్చారు
 మీడియాతో మాజీ మంత్రి ఈటల

మన తెలంగాణ/కరీంనగర్‌ప్రతినిధి: రాష్ట్ర మంత్రులు అంతరాత్మ సాక్షిగా మాట్లాడాలని వారి విమర్శలు వారి విజ్ఞతకే వదిలేస్తానని మాజీ మంత్రి, హుజురాబాద్ ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం హుజురాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేను ఎప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదని గుర్తుచేశారు. తాను ఎవ్వరి గురించి కూడా విమర్శలు చేయలేదని తెలిపారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చింది తెరాస పార్టీ, ఈ స్థానంలో నిలబెట్టిన వ్యక్తి సిఎం కెసిఆర్ మాత్రమేనన్నారు. అంత గొప్ప వ్యక్తి అయిన కెసిఆర్ ఎవరి వల్లనో.. ఎవరి రిపోర్టు వల్లనో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో అర్థం కావడం లేదన్నారు. కెసిఆర్ తరువాత ఆయన కుమారుడు సిఎం కావాలని స్వాగతించాను తప్ప తాను సిఎం కావాలని అనుకోలేదని అన్నారు. నువ్వు చేసింది మంచిది కాదని పిలిచి చెప్తే తానే రాజీనామా చేసే వాడినని, కానీ భూ కుంభకోణం నెపంతో ఇంత కక్ష సాధింపు అవసరమా? అని ఆ వేదన వ్యక్తం చేశారు. నాది తప్పయితే ఏ శిక్షకైనా సిద్ధ్దమేనని తెలిపారు. ఇంత చెప్పిన తరువాత కూడా తనను వి మర్శిస్తున్న ఎవరి మాటాలకు కూడా స్పందించనన్నారు.
ఐఎఎస్‌లు అదరాబాదరా చేశారు
నోటీసులు ఇవ్వకుండా ఐఏఏస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, రిపోర్టు ఇచ్చిన అధికారులు, నీచంగా ప్రవర్తించి అదరాబాదరా ఇచ్చారని మాజీ మంత్రి ఈటల అన్నారు. తనకు నోటీసులు ఇచ్చి భూముల హద్దులు కొలవాలి కాని నోటీసులు ఇవ్వకుండా హద్దులు కొలవడం సరైంది కాదని అన్నారు. దేశ చరిత్రలో బాధ్యత గల మంత్రి మీద అదరాబాదరా నివేదికలు ఇచ్చిన చరిత్ర ఇదేనన్నారు.

Etela Rajender press meet in Huzurabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News