- Advertisement -
నల్లగొండ: రెండో పెళ్లి అడ్డుగా ఉందని కన్న కూతురునే తండ్రి హత్య చేసిన సంఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగింది. నిందితుడికి జీవిత ఖైదుతో పాటు ఆరు నెలల జైలు శిక్ష విధించినట్టు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రమేష్ బాబు తెలిపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జోయవాడలో అంబూరి వెంకటేష్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ప్రభుత్వ టీచర్‌గా పని చేస్తున్న భార్య చనిపోవడంతో ఏడో తరగతి చదువుతున్న కూతురుతో కలిసి జీవిస్తున్నాడు. రెండో పెళ్లికి అడ్డుగా ఉందని ఏడో తరగతి చదువుతన్న పదమూడు ఏళ్ల కూతురు శివాణిని 2012లో గొంతునులిమి చంపేశాడు. అప్పుడు సిఐ మనోహర్ ఘటనా స్థలానికి చేరుకొని తండ్రిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. నిందితుడిపై నేరారోపణలు రుజువుకావడంతో జిల్లా సెషన్స్ తీర్పు ఇచ్చినట్లు ఎస్ఐ నర్సింహులు పేర్కొన్నారు.
- Advertisement -