మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 1,16,367 శాంపిల్స్ పరీక్షించగా 22,204 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్టు వైద్యారోగ్యశాఖ బుధవారం నాడు ఒక ప్రకటనలో వెల్లడించింది. అలాగే కరోనా బారిన పడి చికిత్స పొందుతూ 85 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,69,50,299 శాంపిల్స్ పరీక్షించగా 12,06,232మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 10,27,270మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 8374మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,70,588 క్రియాశీల కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో విశాఖ, విజయనగరంలో 11మంది మృత్యువాత పడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 2,344 మంది కరోనా బారిన పడ్డారు. అత్యల్పంగా కడప జిల్లాలో 903 కేసులు నమోదయ్యాయి. ఇక మరణాలను పరిశీలిస్తే విశాఖపట్నం, విజయనగరంలలో 11మంది చొప్పున ప్రాణాలు కోల్పోగా అనంతపురంలో 10, తూర్పుగోదావరి 9, ప్రకాశం 8, పశ్చిమగోదావరి 7, చిత్తూరు 6, గుంటూరు 5, కర్నూలు 5, నెల్లూరు 5, కృష్ణా 4, శ్రీకాకుళం 3, కడపలో ఒకరు మృతి చెందారు.
కర్ఫూలో వెసులుబాటు ః ఎపిలో కరోనా కట్టడిలో భాగంగా కర్ఫ్యూ నిబంధనల నుంచి కొన్నింటికి వెసులుబాట్లు కల్పించారు. ముఖ్యంగా బ్యాంకులు, జాతీయ రహదారి పనులు, పోర్టులు పనులకు సంబంధించి కర్ఫ్యూ నిబంధనల నుంచి వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఎపిలో గురువారం నుంచి బ్యాంకుల పనివేళల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. కర్ఫ్యూ కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే బ్యాంకులు పనిచేస్తాయని బ్యాంకర్ల కమిటీ ప్రకటించింది.రాష్ట్రంలో ఉన్న పలు పోర్టులు కూడా యధావిధిగా ఆపరేషన్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం దీని పై జిల్లా కలెక్టర్లు, ఎస్‌పి, పోలీస్ కమిషనర్లకు ఆదేశాలు పంపింది.
22204 New Corona Cases Reported in AP