Friday, November 22, 2024

భూమి వైపు దూసుకొస్తున్న చైనా రాకెట్ శకలాలు

- Advertisement -
- Advertisement -

China rocket fragments falling towards Earth

 

వాషింగ్టన్: కొవిడ్ భయంతో అల్లాడుతున్న ప్రపంచానికి చైనా రాకెట్ భయం ముంచుకొస్తోంది. ఓ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడానికి చైనా చేస్తున్న ప్రయోగాల్లో భాగంగా ఏప్రిల్ 29న చైనా లాంగ్‌మార్చి 5 బి అనే రాకెట్ తియాన్హే స్పేస్ మాడ్యూల్‌ను అంతరిక్షం లోని 300 కిలోమీటర్ల ఎత్తున కక్ష లోకి చేర్చింది. ఈ మాడ్యూల్ పొడవు 30 మీటర్లు. అయితే ఆ రాకెట్ శకలాలు పొరపాటున తాత్కాలిక కక్ష లోకి చేరాయి. అవి ఇప్పుడు భూమి పైకి దూసుకు వస్తున్నాయి. ఈ రాకెట్ బరువు దాదాపు 21 టన్నులు. సాధారణంగా ఏ రాకెట్ కూలిపోయినా ఆ శకలాలు సముద్రంలో పడుతుంటాయి.

కానీ చైనా ప్రయోగించిన లాంగ్ మార్చి 5 బి రాకెట్ మాత్రం భూమి పైకి దూసుకు వస్తోంది. ఈనెల 8న అది భూమిపై పడనుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అమెరికా రక్షణ శాఖ ఈ రాకెట్‌ను ట్రాక్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అది కచ్చితంగా ఏ ప్రదేశంలో భూ వాతావరణంలో ప్రవేశిస్తుందో అంచనా వేయలేక పోతున్నారు. ఈ రాకెట్ మార్గాన్ని అమెరికా స్పేస్ కమాండ్ నిశితంగా పరిశీలిస్తోంది. 2022 నాటికి అంతరిక్షంలో స్వంతంగా స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నదే చైనా లక్ష్యం. ఇందులో ముగ్గురు వ్యోమగాములు ఉంటారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News