- Advertisement -
బ్యాంకుల పని వేళల కుదింపు
కోల్‌కతా: కరోనా నియంత్రణకు బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం కొత్తగా మరికొన్ని ఆంక్షలు విధించింది. స్థానిక రైళ్లను రద్దు చేసింది. మెట్రో, ప్రజా రవాణా సర్వీసుల్ని 50 శాతానికి తగ్గించింది. బ్యాంకుల పని వేళల్ని కుదించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే బ్యాంకులు తెరవాలని ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాలను 50 శాతం సిబ్బందితోనే నిర్వహించాలని తెలిపింది. ఈ ఆంక్షలు గురువారం నుంచి అమలులోకి రానున్నాయి. వర్క్ ఫ్రం హోంకు ఉద్యోగుల్ని ప్రోత్సహించాల్సిందిగా ప్రైవేట్ సంస్థలకు మమతా బెనర్జీ సూచించారు. బుధవారం మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొద్ది సేపటికే ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం మమత ఈ ఆదేశాలిచ్చారు.
- Advertisement -