- Advertisement -
న్యూఢిల్లీ: విదేశీయులు సహాయంగా పంపిన వైద్య పరికరాలు పెట్టెల్లో దాచి పెట్టడానికి కాదని ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వైద్య పరికరాల్ని అవసరమైన కొవిడ్ పేషెంట్లకు వినియోగించాలని ఆదేశించింది. విదేశాల నుంచి సహాయంగా వచ్చిన వైద్య పరికరాల పంపిణీలో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు హేతుబద్ధంగా వ్యవహరించడం లేదని కోర్టు సహాయకుడు, సీనియర్ న్యాయవాది రాజశేఖర్‌రావు హైకోర్టు దృష్టికి తేగా ఈ ఆదేశాలిచ్చింది. ఢిల్లీలోని లేడీ హార్డింగే మెడికల్ కాలేజీకి 260 ఆక్సీజన్ కాన్సెంట్రేటర్లు రాగా, అక్కడ అన్ని అవసరం లేదని సహాయకుడు కోర్టు దృష్టికి తెచ్చారు. వైద్య సేవల కోసం అవసరమైతే స్వచ్ఛంద సంస్థలకు భాగస్వామ్యం కల్పించాలని కేంద్రానికి హైకోర్టు సూచించింది.
- Advertisement -