Friday, November 22, 2024

కరోనాతో వణికిపోతున్న ఢిల్లీ

- Advertisement -
- Advertisement -

Corona Patients Can Book Oxygen Online From Home

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశరాజధాని ఢిల్లీని గడగడలాడిస్తోంది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక రోగుల ప్రాణాలు పోతున్నాయి. దీంతో ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. హోం ఐసోలేషన్ లో ఉండి, ఆక్సిజన్ అవసరమైనవారికి ప్రభుత్వం నేరుగా సరఫరా చేయనున్నారు. తమకు ఆక్సిజన్ అవసరమయ్యే లేదా వారి బంధువుల కోసం తప్పనిసరిగా https://delhi.gov.in పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. వారు దరఖాస్తుతో పాటు, ఆధార్, కోవిడ్ పరీక్ష నివేదిక,సిటి-స్కాన్ నివేదిక ఏదైనా ఉంటే సమర్పించాలని సూచింది. ఈ విధానం ద్వారా ఆక్సిజన్ అవసరమైన బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సిలిండర్లను నేరుగా అందజేయనున్నారు. ఆక్సిజన్ కోసం పేరు నమోదు చేసుకునే వారు ఆధార్, కోవిడ్ టెస్టు రిపోర్ట్ అటాచ్ చేయాలని అధికారులు సూచించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News