- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ నుంచి ఎపికి వెళ్లే ఆర్టీసీ బస్సులన్నీ బంద్ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఎపిలో కర్ఫ్యూ వల్ల తాత్కాలికంగా బస్సులు నిలివేస్తున్నట్టు టిఎస్ ఆర్టీసీ ఎండి తెలిపారు. తెలంగాణ, ఎపి మధ్య మెడికల్ ఎమర్జెన్సీ వాహనాలకే అనుమతిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఉదయం బయలుదేరిన బస్సులు మధ్యాహ్నానికి తిరిగి చేరుకునే అవకాశం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఎపి మీదగా వెళ్లే ఇతర బస్సు సర్వీసులను కూడా రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఎపి ప్రభుత్వం నుంచి తర్వాతి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిబంధనలు కొనసాగుతాయని టిఎస్ ఆర్టీసీ ప్రకటించింది.
TSRTC cancels bus services to AP
- Advertisement -