న్యూఢిల్లీ: కరోనాపై పోరులో కలిసి పనిచేసేందుకు సిద్ధమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తన సూచనను సానుకూలంగా తీసుకుంటారని ఆశిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీ లేఖ రాశారు. కరోనా వ్యాప్తికి కేంద్ర ప్రభుత్వ విధానమే కారణమని రాహుల్ ఆరోపించారు. కేంద్ర విఫలం కావడంతోనే లాక్ డౌన్ స్థాయి ఆక్షలు దేశంలో అమలవుతున్నాయన్నారు. దేశంలోని పేదలకు ఆర్థిక, ఆహార సాయం అందించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రజల ఇబ్బందులను పరిష్కరించేలా కృషియాలన్నారు. టీకాల పంపిణీలో వ్యూహం లేకపోవడంతోనే తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. సంక్షోభం నుంచి బయటపడేందుకు పేదలకు తొడ్పాటు ఇవ్వాలని కోరారు. ప్రతి పేద కుటుంబానికి రూ.6వేల సాయం అందించాలని కేంద్రాన్ని కోరారు. కరోనా సెకండ్ వేవ్ విపత్తులో దేశం విలవిలలాడుతోందని.. ఎలాగైనా సరే ప్రజల ఇబ్బందులు తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
Rahul Gandhi’s letter to PM Modi