ఆసుపత్రిని సందర్శించిన సిఎస్ సోమేష్‌కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్ : గాంధీలోని వైద్యసిబ్బంది అద్బుతంగా పనిచేస్తున్నారని సిఎస్ సోమేష్‌కుమార్ కొనియాడారు. ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా ప్రజలను కాపాడేందుకు ఎంతో శ్రమిస్తున్నారన్నారు. గాంధీ హాస్పిటల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన 160 అదనపు పడకలతో సిద్ధం చేసిన కొత్త వార్డును సిఎస్ శుక్రవారం పరిశీలించారు. మరోవైపు రోజుకు 4 మెట్రిక్ టన్నుల సామర్థంతో నెలకొల్పిన కొత్త ఆక్సిజన్ ప్లాంట్‌ను కూడా సిఎస్ తనిఖీ చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ..పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఆక్సిజన్ ప్లాంట్‌తో సుమారు 400 మంది పేషెంట్లకు సరిపడా ఆక్సిజన్‌ను అందించవచ్చన్నారు. రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించుటుకై క్లీనిలైనెస్ డ్రైవ్ కింత చేపట్టిన పారిశుద్ధం, వీధి దీపాలు, ఆక్సిజన్ పైప్‌లైన్ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, జిఎచ్‌ఎంసి కమీషనర్ లోకేష్‌కుమార్ మున్సిపల్ పరిపాలన కమీషనర్ యన్ .సత్యనారాయణ, పోలీస్ కమీషనర్ అంజనీకుమార్, ఆర్థికశాఖ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రాస్, టిఎస్‌ఎంఎస్‌ఐడిసి ఎండి చంద్రశేఖర్‌రెడ్డి, డిఎంఇ డా రమేష్‌రెడ్డిలు పాల్గొన్నారు.