మాడ్రిడ్: తల్లిని చంపి అనంతరం మృతదేహాన్ని 1000 ముక్కలుగా నరికి కుమారుడు కూర వండుకొని తిన్న సంఘటన స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అల్బెర్టో సాంచేజ్ గోమేజ్ అనే వ్యక్తి తన తల్లి మారియా సోలెడాడ్ గోమేజ్‌తో నివసిస్తున్నాడు. మారియాను కుమారుడు గొంతు నులిమి చంపిన అనంతరం వంటింట్లో ఉండే కత్తి, చాకుతో మృతదేహాన్ని 1000 ముక్కలుగా నరికాడు. ముక్కలను ఓ బాక్స్‌లో భద్రపరిచి ఫ్రీజులో పెట్టాడు. ముక్కలు తీసి వండుకొని తినేవాడు. ఆ ముక్కలు ఇంట్లో ఉన్న శునకానికి ఆహారంగా ఇచ్చేవాడు. మారియా కొన్ని రోజుల కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఆమె స్నేహితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణలో నిమిత్తం ఇంటికి వెళ్లి చూడగా ఫ్రీజులో మాంసపు ముద్దలు కనిపించాయి. వెంటనే ఆమె కుమారుడు అల్బెర్టోను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో హత్య చేశానని ఒప్పకున్నాడు. దీంతో అతడికి కోర్టు 16 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అతడి మానసిక స్థితి సరిగా లేదని వైద్యులు తెలిపారు.