Saturday, November 23, 2024

గుజరాత్‌లో బ్లాక్ ఫంగస్ పంజా

- Advertisement -
- Advertisement -

Black fungus cases rise in Gujarat

గుడ్డివారవుతున్న పలువురు రోగులు

అహ్మదాబాద్ : కొవిడ్ రోగులలో తలెత్తిన అనుబంధపు జబ్బు బ్లాక్ ఫంగస్ గుజరాత్‌లో పలువురి కంటిచూపును హరించివేసింది. శనివారం ఈ విషయాన్ని ఇక్కడ అధికారులు, వైద్యులు శనివారం తెలిపారు. కరోనా తీవ్రత ఉన్న రోగులలో కోలుకున్న తరువాత లేదా చికిత్స దశలో ఉన్నట్లుండి మ్యుకొరికోసిస్ అనే ఫంగస్ తలెత్తుతోంది. ఇది ప్రాణాంతకం అవుతోంది. గుజరాత్‌లో కొవిడ్ రోగులలో ఇది సోకి ఇప్పటికే పలువురు కంటిచూపు కోల్పోయ్యారని వెల్లడైంది. దీనితో గుజరాత్ వ్యాప్తంగా కొవిడ్ అనగానే ఫంగస్ ముప్పు కూడా అందరిని భయపడుతోంది. సూరత్‌లోని కిరణ్ సూపర్ మల్టిస్పెషాల్టీ ఆసుపత్రి ఛైర్మన్ మాథుర్ సవాని ఇప్పుడు అంధులు అయిన కొవిడ్ రోగుల గురించి తెలియచేశారు. ఇటీవలే కొవిడ్ నుంచి స్వస్థత చేకూరిన వారిలో ఫంగస్ తలెత్తిన విషయాన్ని గుర్తించామని , మూడు వారాల క్రితం ఆరోగ్యవంతులు అయిన వారిలో ఈ కొత్త ఫంగస్ రావడం బాధాకరం అని వివరిచారు.

ఇప్పటికైతే ఇటువంటి ఫంగస్ తెగులు సోకిన వారి సంఖ్య 50 వరకూ ఉందని, మరో 60 మంది వరకూ చికిత్స జరపాల్సి ఉందని తెలిపిన ఆయన మొత్తం మీద దాదాపు వంద మందికి పైగా ఇటువంటి ఫంగస్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు పరోక్షంగా వివరించారు. అయితే వీరిలో ఎందరు కంటిచూపు పోగొట్టుకుంటారనేది వెల్లడికాలేదని తెలిపారు. అయితే చాలా మంది ఈ ఫంగస్ కారణంతో కంటిచూపు పోగొట్టుకున్నట్లు అనధికారిక వార్తలు స్పష్టం చేశాయి. ఈ హాస్పిటల్ ఓ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇక్కడికి అత్యధికంగానే కరోనా రోగులు చికిత్స కోసం వస్తున్నారు. అయితే వీరిలో కోలుకుని ఇళ్లకు వెళ్లిన వారు ఇప్పుడు ఈ మ్యుకోరికోసిస్ బాపతు జబ్బుతో ముక్కులు మూసుకుపోయి, నడవలేని స్థితికి చేరుకుని తల్లడిల్లుతున్నారు.

తమ ఆసుపత్రికి ఫంగస్ జబ్బుతో వచ్చిన వారికి తగు చికిత్స జరిపించి ఇంటికి పంపించినట్లు కిరణ్ ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.ఇప్పుడు ఈ ఫంగస్ టైప్ జబ్బు ఉన్న వారు ఎక్కువగా రావడంతో గుజరాత్‌లో ప్రత్యేకించి సూరత్‌లో ఇతర చోట్ల సర్కారీ దవాఖానాలలో ఈ ఫంగస్ రోగులకు చికిత్సకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు స్థానిక వైద్యాధికారి డాక్టర్ కేతన్ నాయక్ తెలిపారు. కొవిడ్ నుంచి చికిత్స తరువాత కోలుకున్నారు. అయితే తరువాతి దశలో వారికి ఫంగస్ సోకింది. దీనితో చాలా మంది కళ్లు దెబ్బతిని, కొందరిలో కంటిచూపు పోయి, కాళ్లు చేతులకు ప్రధాన అవయవాలకు సరైన రక్త ప్రసరణ లేక దీనావస్థలో ఉన్నట్లు వెల్లడైంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News