Friday, November 22, 2024

కొవిడ్ సర్టిఫికెట్ లేకున్నా చికిత్స జరపాలి

- Advertisement -
- Advertisement -

Covid should be treated without positive certificate

ఆరోగ్య మంత్రిత్వశాఖ సరికొత్త ఉత్తర్వులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉండటంతో చికిత్సలకు సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ పెషెంట్లను కొవిడ్ చికిత్సా కేంద్రాలలో చేర్పించే విషయంలో ఉన్న జాతీయ మార్గదర్శకాల విధానానికి మార్పులు చేసింది. దీని మేరకు ఇకపై కొవిడ్ అనుమానాలు తలెత్తితో కొవిడ్ 19 పాజిటివ్ టెస్ట్ రిపోర్టు లేకపోయినా వెంటనే అటువంటి వారిని ఆసుపత్రిలో చికిత్సకు తీసుకోవల్సి ఉంటుంది. ఈ మేరకు తాజా ఉత్తర్వులను ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం వెలువరించింది. సత్వరమే కొవిడ్ రోగులకు చికిత్స చేసేందుకు ఈ సవరించిన మార్గదర్శకాలు పనికి వస్తాయి. ఇది రోగుల క్షేమాన్ని కేంద్రీకృతం చేసుకుని తీసుకున్న చర్య అని , కరోనా వైరస్ లక్షణాలు ఏ కోశాన ఉన్నా వెంటనే వారిని సంబంధిత ఆసుపత్రులలో లేదా చికిత్స కేంద్రాలలో చేర్పించేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుందని తెలిపారు. కొవిడ్ పాజిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి కాకుండా నిబంధనలను మార్చారని వివరించారు. ఈ మేరకు కేంద్రం నుంచి అన్ని రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాలకు, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఆసుపత్రులకు ఉత్తర్వులు పంపించారు.

ఎక్కడైతే కొవిడ్ చికిత్స జరుగుతుందో అక్కడికి వచ్చే రోగులను కొవిడ్ పాజిటివ్ సర్టిఫికెట్ల గురించి అడగరాదని స్పష్టం చేశారు. కొవిడ్‌తో బాధపడుతూ లేదా అటువంటి లక్షణాలతో వచ్చిన వారు సర్టిఫికెట్లు తీసుకుని రావడం వల్ల కాలాయాపన అవుతుంది. ఈ లోగా కరోనా రోగుల సంఖ్యలో పెరుగుదలకు మార్గం ఏర్పడుతుంది. దీనిని నివారించేందుకు ప్రస్తుత చికిత్స విధానాన్ని మార్చినట్లు తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్న వారు వస్తే వెంటనే వారిని సిసిసి, డిసిహెచ్‌సి లేదా డిహెచ్‌సి వంటి కేంద్రాలలోని సంబంధిత వార్డులకు తరలించాల్సి ఉంటుంది. వారికి చికిత్స జరపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఏ రోగికి కూడా చికిత్స సంబంధిత సేవలను ఎటువంటి కారణం చేతనైనా నిరాకరించరాదు. వారికి ఆక్సిజన్, లేదా నిత్యావసర ఔషధాలు ఇతరత్రా వైద్య చికిత్స విషయంలో ఎటువంటి షరతులకు దిగరాదని స్పష్టం చేశారు. వేరే నగరాలు వేరే ప్రాంతాల ప్రాతిపదికన కూడా అనుమతిని నిరాకరించరాదని తెలియచేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News