సంపూర్ణేష్ బాబు ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘క్యాలీఫ్లవర్’. మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణ టాకీస్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్.కె.మలినేని ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో సంపూ బ్రిటీషర్ పాత్రలో కనిపించనున్నాడు. ఆదివారం సంపూర్ణేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కొద్దిసేపటి క్రితం ఈ మూవీ నుంచి చిన్న టీజర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీతోపాటు సంపూర్ణేష్ బాబు ‘బజార్ రౌడీ’ అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
'Burning Star' @sampoornesh as the Grand Father of #𝐂𝐀𝐔𝐋𝐈𝐅𝐋𝐎𝐖𝐄𝐑
🎬 #RKMalineni
🎵 #Prajwal
📽️ #MujeerMalik
💰 #AshaJyothiGogineni #MadhuSudhanaCreations #RadhaKrishnaTalkies#HBDSampoorneshBabu pic.twitter.com/FkNSsMezIn— BA Raju's Team (@baraju_SuperHit) May 9, 2021
Sampoornesh Babu’s Cauliflower teaser released